Skip to main content

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ప్రారంభం

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో నవంబర్ 5న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2019 ప్రారంభమైంది.
నవంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫెరెన్‌‌స ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘చంద్రయాన్-2’ విజయవంతమైన ప్రాజెక్టేనని, ఆ ప్రయోగం కారణంగా దేశ యువతకు సైన్‌‌స పట్ల ఆసక్తి పెరిగిందని మోదీ వ్యాఖ్యానించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల పాత్ర లేకుండా ఏ దేశం కూడా పురోగతి సాధించలేదన్నారు. సైన్‌‌సలో వైఫల్యం అనేది ఉండదని, అలుపెరగకుండా ప్రయోగాలు చేస్తూనే ఉండాలని వ్యాఖ్యానించారు. గతంలో అవసరాలే ఆవిష్కరణలకు దారితీసేవని భావించేవారు... కానీ ఇప్పుడు ఆవిష్కరణలు అవసరాల పరిధి దాటి విస్తరించాయన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2019 ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 5
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమబెంగాల్
Published date : 06 Nov 2019 06:14PM

Photo Stories