ఇండియా బ్యాడ్మింటన్ టోర్ని విజేతగా సుమీత్ జోడీ
Sakshi Education
ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సుమీత్ రెడ్డి - మనూ అత్రి (భారత్) జోడి విజేతగా నిలిచింది.
ముంబైలో నవంబర్ 24న జరిగిన ఫైనల్లో సుమీత్ జోడి 21-15, 21-15తో చలోంపాన్ - కిట్టిసక్ నమ్‌దాష్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచింది. కేవలం 32 నిమిషాల పాటు సాగిన టైటిల్ పోరులో భారత ద్వయం జోరు కనబర్చింది. వరుస గేముల్లో గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకుంది.
మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. కౌశల్ ధర్మామర్ 19-21, 21-8, 14-21తో ఐదో సీడ్ జియాదోంగ్ షెంగ్ (కెనడా) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగం విజేత
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : సుమీత్ రెడ్డి - మనూ అత్రి (భారత్)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర

Published date : 25 Nov 2019 05:48PM