Skip to main content

ఇమిగ్రేషన్‌ వీసాలపై నిషేధం: ట్రంప్‌

అమెరికాలోకి అన్ని రకాల వలసలపై తాత్కాలికంగా నిషేధం విధించే అధికారిక ఉత్తర్వులపై త్వరలో సంతకం చేయనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.
Current Affairs

అదృశ్య శత్రువైన కరోనా వైరస్‌ దాడి నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు, అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కల్పించేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్ 20న ట్వీట్‌ చేశారు.


హెచ్‌1
బీ పైనా ప్రభావం
ట్రంప్‌ సంతకం చేయనున్న ఉత్తర్వుల్లో ఏం ఉండబోతోందన్నది, ఆ ఉత్తర్వులపై ఆయన ఎప్పుడు సంతకం చేయనున్నారన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఇమిగ్రేషన్‌ వీసాలపైననే తాత్కాలిక నిషేధం విధించబోతున్నట్లు ట్రంప్‌ ట్వీట్‌ చేసినప్పటికీ.. అమెరికన్ల ఉద్యోగ భద్రతపై కూడా ఆ ట్వీట్‌లో ప్రస్తావించినందువల్ల నాన్‌– ఇమిగ్రంట్‌ వీసా అయిన హెచ్‌1బీ పైనా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే.. విదేశీయులపై ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికా ఇప్పటికే యూరోప్, చైనా, కెనడా, మెక్సికోల నుంచి విదేశీయులెవరూ దేశంలోకి రాకుండా నిషేధం విధించింది. అన్ని వీసా సేవలను నిలిపేసింది. కరోనా కారణంగా అమెరికా ఆర్థికంగా భారీగా దెబ్బ తిన్నది. ఇప్పటికే 2.2 కోట్ల మంది అమెరికన్లు నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : అన్ని రకాల వలసలపై తాత్కాలికంగా నిషేధం
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : అమెరికా డొనాల్డ్‌ ట్రంప్‌
ఎందుకు : అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కల్పించేందుకు
Published date : 22 Apr 2020 06:49PM

Photo Stories