Skip to main content

ఇజ్రాయెల్, యూఏఈ శాంతి ఒప్పందం

నిత్యం రావణకాష్టంలా రగిలి పోయే మధ్యప్రాచ్యంలో దౌత్యపరంగా భారీ ముందడుగు పడింది.
Current Affairs
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వం ఫలించి ఆగస్టు 13న ఇజ్రాయెల్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లు శాంతి స్థాపన దిశగా అడుగులు వేశాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పటిష్టతకు చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్‌కు స్నేహహస్తం చాచిన మొట్టమొదటి గల్ఫ్‌ దేశంగా, అరబ్‌ ప్రపంచంలో మూడో దేశంగా యూఏఈ నిలిచింది. పాలస్తీనా ఆక్రమణపై ఇరు దేశాల మధ్య పాతికేళ్లుగా కొనసాగుతున్న వైరానికి ట్రంప్‌ చొరవతో తెరపడింది.

తాజా ఒప్పందంపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్ స్పందిస్తూ... అరబ్‌ ప్రపంచంతో కొత్త శకం ఏర్పాటవుతోందని పేర్కొన్నారు. పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించకూడదన్న షరతు మీదే ఒప్పందం కుదుర్చుకున్నామని యూఏఈ యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్ జాయేద్‌ ట్వీట్‌ చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇజ్రాయెల్, యూఏఈ శాంతి ఒప్పందం
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, యూఏఈ యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్ జాయేద్‌
ఎందుకు :ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పటిష్టతకుః
Published date : 15 Aug 2020 05:35PM

Photo Stories