Skip to main content

ఇజ్రాయెల్‌ నూతన ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి?

ఇజ్రాయెల్‌ నూతన ప్రధానిగా యామినా పార్టీ అధ్యక్షుడు నఫ్తాలీ బెన్నెట్‌ (49) ఎన్నికయ్యారు.
Current Affairs ఇజ్రాయెల్‌ రాజధాని జెరుసలేంలో జూన్‌ 13న ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. పరస్పర విరుద్ధ సిద్దాంతాలు, భావజాలాలతో కూడిన ఎనిమిది పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి బెన్నెట్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో గడిచిన రెండేళ్లలో ఇజ్రాయెల్‌లో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. 120 సభ్యులుగల ఇజ్రాయెల్‌ పార్లమెంటులో ఈ కూటమికి సరిగ్గా సాధారణ మెజారిటీ (61) ఉంది. కొత్త సంకీర్ణం ఏర్పడటంతో 12 ఏళ్ల కాలంపాటు ఇజ్రాయెల్‌ ప్రధానిగా కొనసాగిన బెంజమిన్‌ నెతన్యాహు పదవీచ్యుతుడయ్యారు. నెతన్యాహు పార్టీ లికుడ్‌కు కేవలం 30 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది.

2023 సెప్టెంబరులో లాపిడ్‌...
మెజారిటీని కూడగట్టడంలో నెతన్యాహు విఫలం కావడంతో ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు రువెన్‌ రివ్లిన్‌ రెండో అతిపెద్ద పార్టీ అయిన యెష్‌ అటిడ్‌ (17 సీట్లు) అధినేత లాపిడ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే లాపిడ్, బెన్నెట్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం... తొలుత బెన్నెట్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2023 సెప్టెంబరులో లాపిడ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి... ప్రస్తుత పార్లమెంటు పదవీకాలం ముగిసేదాకా, రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఇజ్రాయెల్‌ నూతన ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి?
ఎప్పుడు : జూన్‌ 13
ఎవరు : యామినా పార్టీ అధ్యక్షుడు నఫ్తాలీ బెన్నెట్‌
Published date : 15 Jun 2021 08:25PM

Photo Stories