ఇజ్రాయెల్ 11వ అధ్యక్షుడిగా ఎన్నికైన రాజకీయవేత్త?
Sakshi Education
ఇజ్రాయెల్ దేశ 11వ అధ్యక్షుడిగా సీనియర్ రాజకీయవేత్త ఇసాక్ హెర్జోగ్ ఎన్నికయ్యారు. జూన్ 1న ఆ దేశ పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఆయన గెలుపొందారు. మొత్తం 120 మంది సభ్యులు ఉన్న పార్లమెంటులో ఆయన 87 ఓట్లు పొందారు.
ఆయన ప్రత్యర్థి పెరెజ్ కేవలం 26 ఓట్లు మాత్రమే పొందగలిగారు. ఇసాక్ తండ్రి చైమ్ హెర్జోగ్ కూడా 1983–1993మధ్యకాలంలో ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. జూలై 9కి ప్రస్తుత అధ్యక్షుడు రూవేన్ రూవ్లిన్ పదవీకాలం ముగియనుంది. అనంతరం ఇసాక్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు... ఇసాక్‌కు అభినందనలు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇజ్రాయెల్ 11వ అధ్యక్షుడిగా ఎన్నికైన రాజకీయవేత్త?
ఎప్పుడు :జూన్ 2
ఎవరు :ఇసాక్ హెర్జోగ్
ఎందుకు :జూలై 9కి ప్రస్తుత అధ్యక్షుడు రూవేన్ రూవ్లిన్ పదవీకాలం ముగియనుండటంతో..
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇజ్రాయెల్ 11వ అధ్యక్షుడిగా ఎన్నికైన రాజకీయవేత్త?
ఎప్పుడు :జూన్ 2
ఎవరు :ఇసాక్ హెర్జోగ్
ఎందుకు :జూలై 9కి ప్రస్తుత అధ్యక్షుడు రూవేన్ రూవ్లిన్ పదవీకాలం ముగియనుండటంతో..
Published date : 04 Jun 2021 02:39PM