Skip to main content

‘ఈడబ్ల్యూఎస్’ రిజర్వేషన్లకు సీఎం ఆమోదముద్ర

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణాల్లోని బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఫైలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
అనంతరం సంబంధిత ఫైలుపై ఉన్నతాధికారుల సంతకం కూడా పూర్తయింది. ఆ ఫైలుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతకం తీసుకొని తక్షణమే ఉత్తర్వులు జారీచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి. ఈ సీట్ల పెంపునకు కూడా ఎంసీఐ తాజాగా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించే ఫైలుకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర
ఎవరు: ముఖ్యమంత్రి కేసీఆర్
ఎందుకు: మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణాల్లోని బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు
Published date : 20 Jun 2019 05:49PM

Photo Stories