Skip to main content

హత్యకు గురైన బలూచ్ హక్కుల మహిళా కార్యకర్త?

బలూచిస్తాన్ హక్కుల కార్యకర్త <b>కరీమా బలూచ్</b> హత్యకు గురయ్యారు. డిసెంబర్ 20 నుంచి కనిపించకుండా పోయిన కరీమా మృతదేహాన్ని కెనడాలోని టొరెంటో హార్బర్‌ఫ్రంట్ సమీపంలో డిసెంబర్ 22న కనుగొన్నారు.
Current Affairs
2016లో పాకిస్తాన్ నుంచి కెనడా దేశానికి శరణార్థిగా వచ్చిన కరీమా పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్(విస్తీర్ణం పరంగా) బలూచిస్తాన్లో మానవహక్కుల కోసం నిరంతరం పోరాడుతూ వచ్చారు. 2016లో బీబీసీ ప్రచురించిన 100మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. 2020, డిసెంబర్ 14న కరీమా చివరి ట్వీట్‌లో బలూచ్ ఉద్యమకారులను రక్షించాలని కోరారు.

ఆసియాలోని బంగారం, రాగి, సహజ వాయువు లాంటి వనరులు పుష్కలంగా ఉండే ప్రాంతాల్లో పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ఒకటి. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలూచ్ జాతీయవాదులు ఎప్పటినుంచో తిరుగుబాటు చేస్తున్నారు. కరీమా మృతికి సంతాపంగా బలూచ్ నేషనల్ మూమెంట్ 40 రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : హత్యకు గురైన బలూచ్ హక్కుల మహిళా కార్యకర్త
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : కరీమా బలూచ్
ఎక్కడ : టొరెంటో, కెనడా
Published date : 23 Dec 2020 06:07PM

Photo Stories