Skip to main content

హరూన్ గ్లోబల్‌రిచ్ లిస్ట్ 2020 విడుదల

2019 ఏడాదికి గాను రూపొందించిన 9వ ఎడిషన్ ‘హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2020’ తాజాగా విడుదలైంది.
Current Affairsఈ జాబితాలో 140 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 67 బిలియన్ డాలర్ల సంపదతో 9వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. అలాగే అత్యంత సంపన్న భారతీయుడిగా ముకేశ్ నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్లు (రూ.7,000 కోట్లు), అంతకుమించిన నికర విలువ ఉన్న వారిని ఈ నివేదిక పరిగణనలోకి తీసుకుంది.

హరూన్ రిచ్ లిస్ట్ 2020లోని ముఖ్యాంశాలు
  • ప్రపంచవ్యాప్తంగా 2,817 మంది బిలియనీర్లు ఉన్నారు. 2019లో కొత్తగా 480 మంది బిలియనీర్లుగా అవతరించారు.
  • 799 మంది బిలియనీర్లతో చైనా, 626 మంది బిలియనీర్లతో అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాల తర్వాత భారత్ 138 మందితో మూడో స్థానంలో ఉంది.
  • భారత్‌లో 2019 ఏడాదికి 34 మంది బిలియనీర్లు అదనంగా జత కూడడంతో దేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 38కి చేరుకుంది. భారత్‌కు వెలుపల ఉన్న భారత సంతతికి చెందిన బిలియనీర్లను కూడా కలుపుకుంటే మొత్తం సంఖ్య 170గా ఉంటుంది.
  • భారత్‌లో ప్రతీ నెలా ముగ్గురు చొప్పున పెరగ్గా, చైనాలో ప్రతీ వారానికి ముగ్గురు చొప్పున బిలియనీర్లు పుట్టుకొచ్చారు.
  • జాబితాలో తొలి 100 మందిలో భారత్ నుంచి ముకేశ్‌తోపాటు గౌతమ్ అదానీ, శివ్ నాడార్ (కుటుంబం) చెరో 17 బిలియన్ డాలర్ల సంపదతో 68వ స్థానం దక్కించుకున్నారు. ఉదయ్ కోటక్ 15 బిలియన్ డాలర్ల సంపదతో 91వ స్థానంలో ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2020 విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : హరూన్ సంస్థ
ఎందుకు : ప్రపంచంలోని బిలియనీర్ల వివరాలు తెలిపేందుకు
Published date : 27 Feb 2020 05:33PM

Photo Stories