Skip to main content

హర్పూన్‌ క్షిపణి వ్యవస్థను భారత్‌కు విక్రయించనున్న దేశం?

హర్పూన్‌ జాయింట్‌ కామన్‌ టెస్ట్‌ సెట్‌ (జేసీటీఎస్‌) యాంటీ షిప్‌ క్షిపణి వ్యవస్థను భారత్‌కు విక్రయించడానికి అమెరికా అంగీకరించింది.
దీని అంచనా వ్యయం 8.2 కోట్ల డాలర్లు (దాదాపుగా రూ.60 కోట్లు)గా ఉంది. హర్పూన్‌ క్షిపణి విక్రయానికి సంబంధించి అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించిన సర్టిఫికెట్‌ని డిఫెన్స్‌ సెక్యూరిటీ కోపరేషన్‌ ఏజెన్సీ (డీఎస్‌సీఏ) భారత్‌కు ఆగస్టు 2న పంపింది.

హర్పూన్‌ క్షిపణితో పాటు దానికి సంబంధించిన స్పేర్‌ పార్టులు, ఇతర పరికరాలు, ఆ క్షిపణి ప్రయోగానికి సంబంధించి సిబ్బందికి శిక్షణ, నిర్వహణ, ఇతర లాజిస్టిక్‌ సపోర్ట్‌ అన్నీ కావాలని భారత్‌ గతంలో విజ్ఞప్తి చేసింది. దీంతో 8.2 కోట్ల డాలర్ల అంచనా వ్యయంతో క్షిపణిని విక్రయించడానికి అమెరికా ఆమోదించింది. ఈ క్షిపణి కొనుగోలు ప్రతిపాదనతో భారత రక్షణ రంగం మరిత బలపడుతుందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అమెరికాకు చెందిన బోయింగ్‌ కంపెనీ ప్రధాన కాంట్రాక్టర్‌గా ఈ ఒప్పందంలో ఉంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : హర్పూన్‌ జాయింట్‌ కామన్‌ టెస్ట్‌ సెట్‌ (జేసీటీఎస్‌) యాంటీ షిప్‌ క్షిపణి వ్యవస్థను భారత్‌కు విక్రయించేందుకు అంగీకారం తెలిపిన దేశం?
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : అమెరికా
ఎందుకు : భారత్‌ గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు...
Published date : 04 Aug 2021 05:42PM

Photo Stories