హరియాణా స్పోర్ట్స్ వర్సిటీ వీసీగా కపిల్
Sakshi Education
హరియాణా స్పోర్ట్స్ యూనివర్సిటీ తొలి ఉపకుల పతి(వీసీ)గా భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ నియమితులు కానున్నారు.
ఈ విషయాన్ని హరియాణా క్రీడా శాఖ మంత్రి అనిల్ విజ్ సెప్టెంబర్ 14న వెల్లడించారు. సోనేపట్‌లోని రాయ్‌లో ఈ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు జులై 16న హరియాణా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిజికల్ ఎడ్యుకేషన్, క్రీడా శాస్త్రాల్లో అకడమిక్, శిక్షణా కార్యక్రమాలను ఈ వర్సిటీ నిర్వహించనుంది. ఇప్పటివరకు తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు మాత్రమే క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. తాజాగా క్రీడా విశ్వవిద్యాయం కలిగిన మూడో రాష్ట్రంగా హరియాణా నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హరియాణా స్పోర్ట్స్ యూనివర్సిటీ తొలి ఉపకుల పతి(వీసీ)గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : కపిల్‌దేవ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : హరియాణా స్పోర్ట్స్ యూనివర్సిటీ తొలి ఉపకుల పతి(వీసీ)గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : కపిల్‌దేవ్
Published date : 16 Sep 2019 05:40PM