హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్ భేటీ
Sakshi Education
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు.
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 14న జరిగిన ఈ భేటీలో ‘దిశ’ చట్టరూపం దాల్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, శాసన మండలి రద్దుపై ప్రస్తుత పార్లమెంట్ సెషన్‌లోనే ఆమోదం తెలపాలని అమిత్ షాకు జగన్ విన్నవించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఐదు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పోలీస్ వ్యవస్థ బలోపేతానికి ఊతమివ్వాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వర్తింపజేయాలన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం-2020 తెచ్చినట్లు అమితాషాకు జగన్ వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడి
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడి
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 15 Feb 2020 05:56PM