హిందుస్థాన్ షిప్‌యార్డ్ సీఎండీగా నియమితులైన వారు?
Sakshi Education
హిందుస్థాన్ షిప్‌యార్డ్ నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా నేవీ విశ్రాంత అధికారి కమొడోర్ హేమంత్ ఖత్రి సెప్టెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు.
రియర్ అడ్మిరల్ ఎల్.వి.శరత్‌బాబు స్థానంలో ఖత్రి నియామకం జరిగింది. ఖత్రి షిప్‌యార్డ్‌లో 2017 నుంచి డెరైక్టర్ (స్ట్రాటజిక్ ప్రాజెక్ట్)గా పనిచేశారు. డెరైక్టర్‌గా ఉన్న సమయంలో సంస్థలో మరమ్మతుల కోసం వచ్చిన ఐఎన్‌ఎస్ సింధూవీర్, ఐఎన్‌ఎస్ అస్త్రధరణి సబ్‌మెరైన్‌లను నిర్ణీత సమయం కంటే ముందే అందించారు. ఐఎన్‌ఎస్ దీపక్, ఐఎన్‌ఎస్ శక్తి, నేవల్ ఫీట్ ట్యాంకర్స్ వంటి నౌకలతో పాటు యూరోపియన్ షిప్‌యార్డ్‌లో నౌకల తయారీలో ఖత్రికి అనుభవం ఉంది. హిందుస్థాన్ షిప్‌యార్డ్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హిందుస్థాన్ షిప్‌యార్డ్ నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : నేవీ విశ్రాంత అధికారి కమొడోర్ హేమంత్ ఖత్రి
క్విక్ రివ్యూ :
ఏమిటి : హిందుస్థాన్ షిప్‌యార్డ్ నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : నేవీ విశ్రాంత అధికారి కమొడోర్ హేమంత్ ఖత్రి
Published date : 02 Sep 2020 05:14PM