హిందూ మహాసముద్రంలో ఫ్రాన్స్ నేవీ నిర్వహిస్తోన్న విన్యాసాల పేరు?
Sakshi Education
హిందూ మహాసముద్రంలో ‘లా పెరోస్’ పేరుతో ఫ్రెంచ్ నేవీ విన్యాసాలు ఏప్రిల్ 5న ప్రారంభమయ్యాయి.
ఏప్రిల్ 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్ నావికాదళాలు పాల్గొంటున్నాయి. ఆయా దేశాల యుద్ధ నౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు ప్రదర్శన ఇవ్వనున్నాయి. భారత నావికాదళం నుంచి ఐఎన్‌ఎస్ సాత్పురా, ఐఎన్‌ఎస్ కిల్టన్ యుద్ధ నౌకలు, పి81 లాంగ్‌రేంజ్ ఎయిర్‌క్రాఫ్ట్ పాల్గొంటున్నాయి. వాయు, ఉపరితల యుద్ధ నైపుణ్యాలు, ఆయుధాల వినియోగం, ఎయిర్ డిఫెన్స్, వ్యూహాత్మక యుక్తులు తదితర అత్యాధునిక నావికాదళ విన్యాసాలకు ‘లా పెరోస్’ కేంద్రంగా మారనుంది.
ఫ్రాన్స్ రాజధాని: పారిస్; కరెన్సీ: యూరో, సిఎఫ్‌ఎ ఫ్రాంక్
ఫ్రాన్స్ ప్రస్తుత అధ్యక్షుడు: ఇమ్మానుయెల్ మాక్రాన్
ఫ్రాన్స్ ప్రస్తుత ప్రధానమంత్రి: జీన్ కాస్టెక్స్
ఫ్రాన్స్ అధ్యక్ష భవనం పేరు: ఎలీసీ ప్యాలెస్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘లా పెరోస్’ పేరుతో నేవీ విన్యాసాల నిర్వహణ
ఎప్పుడు : ఏప్రిల్ 5–7
ఎవరు : ఫ్రాన్స్, భారత్, ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్ నావికాదళాలు
ఎక్కడ : హిందూ మహా సముద్రం
ఎందుకు : వ్యూహాత్మక సహకారం కోసం...

Published date : 06 Apr 2021 06:19PM