Skip to main content

హిందూ దైవం ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే అని తెలిపిన సంస్థ?

హిందువుల ఆరాధ్య దైవమైన ఆంజనేయుడి జన్మస్థలం తిరుపతిలోని తిరుమల అని... టీటీడీ ప్రకటించింది.
Current Affairs తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలోని జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని.. అదే అంజనాద్రి అని తెలిపింది. ఇందుకు సంబంధించి పండితుల కమిటీ రూపొందించిన నివేదికను ఏప్రిల్‌ 21న తిరుమలలో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ హాజరయ్యారు.

రాఘవరాయలు నిర్మించిన...
15వ శతాబ్దంలో విజయ రాఘవరాయలు జాపాలిలో నిర్మించిన శ్రీఆంజనేయుని ఆలయమే హనుమ జన్మస్థలం అని ఆధారాలతో కూడిన వివరాలను టీటీడీ తన నివేదికలో పొందుపరిచింది. జాపాలి మహర్షి జపం ఆచరించి శ్రీనివాసుడిని ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జాపాలి అనే పేరు వచ్చింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ) ఈవోగా డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉన్నారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : హిందూ దైవం ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే అని తెలిపిన సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్‌ 21
ఎవరు : తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ)
ఎక్కడ : అంజనాద్రి, తిరుమల, చిత్తూరు జిల్లా
ఎందుకు : ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే అని ఆధారాలు ఉన్నాయని...
Published date : 22 Apr 2021 07:36PM

Photo Stories