Skip to main content

హిమనీనదాల లోతును కొలిచే ప్రాజెక్టును చేపట్టనున్న శాఖ?

హిమాలయాల ప్రాంతంలోని హిమనీనదాల(గ్లేసియర్స్) లోతును తేల్చాలని <b>కేంద్ర ఎర్త్‌సెన్సైస్ శాఖ</b> నిర్ణయించింది.
Edu news

2021, జూన్-జూలైలో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ఎర్త్‌సెన్సైస్ శాఖ కార్యదర్శి రాజీవన్ డిసెంబర్ 20న తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా హిమనీనదాల్లో మంచి నీటి లభ్యత ఎంతనేది తేటతెల్లం కానుంది. ప్రాజెక్టులో భాగంగా... మొదట చంద్రా రివర్ బేసిన్లోని ఏడు హిమనీనదాల్లో అధ్యయనం నిర్వహిస్తారు. చీనాబ్ నదికి ప్రధాన ఆధారం చంద్రా రివర్ బేసినే.

భవిష్యత్తులో...
హిమాలయాల్లో పుట్టే అన్ని నదులకు జల వనరులు అక్కడి హిమనీనదాలే. అవి కరిగి నదుల్లోకి ప్రవహిస్తున్నాయి. భూతాపం వల్ల హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఫలితంగా నదులు చిక్కిపోతున్నాయి. గ్లేసియర్లలో ఉన్న నీటి పరిమాణం ఎంతో తెలిస్తే భవిష్యత్తులో జల ప్రణాళికలు రూపొందించుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.

మంచు-ప్రపంచ రికార్డు
2 గంటల 35 నిమిషాల 43 సెకండ్లపాటు మంచు ముక్కల మధ్య గడిపిన వ్యక్తిగా ఫ్రాన్సులోని వట్రెలోస్‌కు చెందిన రొమయిన్ వాండెన్‌డోర్ప్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : హిమనీనదాల లోతును కొలిచే ప్రాజెక్టును చేపట్టనున్న శాఖ
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : కేంద్ర ఎర్త్‌సెన్సైస్ శాఖ
ఎక్కడ : హిమాలయాల ప్రాంతం

Published date : 21 Dec 2020 07:47PM

Photo Stories