Skip to main content

హీరో మోటోకార్ప్‌కు బీఎస్-జుఖి గుర్తింపు

హీరో మోటోకార్ప్‌కు చెందినస్ల్పెండర్ ఐస్మార్ట్ మోడల్‌కు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) బీఎస్-జుఖి గుర్తింపు దక్కింది.
ఈ మేరకు హీరో సంస్థకు ఐసీఏటీ డెరైక్టర్ దినేశ్ త్యాగి గుర్తింపు పత్రాన్ని అందజేశారు. దీంతో దేశంలో ఈ గుర్తింపు పొందిన తొలి ద్విచక్రవాహన సంస్థగా హీరో మోటోకార్ప్ నిలిచింది. తాజా గుర్తింపుతో బీఎస్-జుఖి నిబంధనలతో స్ల్పెండర్ ఐస్మార్ట్ మోడల్ ఉత్పత్తిని కంపెనీ ప్రారంభించుకోవచ్చు. జయపూర్‌లో కంపెనీ ఆర్‌అండ్‌డీ హబ్‌లో బీఎస్-జుఖి ఉద్గార నిబంధనలతో మోటార్‌సైకిల్ డిజైన్, అభివృద్ధి చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) బీఎస్-జుఖి గుర్తింపు
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : స్ల్పెండర్ ఐస్మార్ట్ మోడల్, హీరో మోటోకార్ప్
ఎక్కడ : భారత్
Published date : 11 Jun 2019 06:33PM

Photo Stories