Skip to main content

హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో భారత్‌కు 84వ స్థానం

హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ జనవరి 7న‌ విడుదల చేసిన ‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్(హెచ్‌పీఐ)-2020’లో భారత పాస్‌పోర్టుకు 84వ స్థానం లభించింది.
Current Affairsభారత్ 58 స్కోరుతో మౌరిటానియా, తజకిస్థాన్ దేశాలతో 84వ ర్యాంకును పంచుకుంది. భారత పాస్‌పోర్ట్‌తో ముందస్తు వీసా లేకుండా 58 దేశాల్లో పర్యటించొచ్చని ఈ స్కోరు సూచిస్తుంది.
 
 హెచ్‌పీఐ-2020లో జపాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్‌పోర్టుతో ఏకంగా 191 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించొచ్చు. ఈ జాబితాలో సింగపూర్ (190 దేశాల్లో పర్యటించే వీలు).. జర్మనీ, దక్షిణ కొరియా (189), ఫిన్లాండ్, ఇటలీ (188), డెన్మార్క్, లగ్జెంబర్గ్, స్పెయిన్ (187) టాప్-5లో నిలిచాయి. అఫ్గానిస్థాన్ పాస్‌పోర్టు చిట్టచివరి స్థానంలో ఉంది. ఇక అమెరికా, బ్రిటన్ ఎనిమిదో ర్యాంకు దక్కించుకున్నాయి.

 క్విక్ రివ్యూ   :
 ఏమిటి : హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో భారత్‌కు 84వ స్థానం
 ఎప్పుడు  : జనవరి 7
 ఎవరు  : హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ
 ఎక్కడ  : ప్రపంచంలో

మాదిరి ప్రశ్నలు

1. ప్రపంచ ఆర్థిక ఫోరం(డబ్ల్యూఈఎఫ్) 2019, డిసెంబర్ 17న ప్రకటించిన ‘లింగభేద సూచీ-2020’లో భారత్‌కు ఎన్నవ ర్యాంకు లభించింది?
 1. 88
 2. 102
 3. 112   
 4. 122

Published date : 11 Jan 2020 06:28PM

Photo Stories