హెల్త్ కేర్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తమిళిసై
Sakshi Education
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో సెప్టెంబర్ 14న జరిగిన ‘ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్, ట్రాన్స్ ఫార్మింగ్ హెల్త్ కేర్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ ముగింపు కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణలో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో పథకాలు పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డిలతోపాటు డాక్టర్లు, 2,500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్, ట్రాన్స్ ఫార్మింగ్ హెల్త్ కేర్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యక్రమం
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
ఎక్కడ : హెచ్‌ఐసీసీ, హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్, ట్రాన్స్ ఫార్మింగ్ హెల్త్ కేర్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యక్రమం
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
ఎక్కడ : హెచ్‌ఐసీసీ, హైదరాబాద్
Published date : 16 Sep 2019 05:32PM