హెలీనా, ధ్రువాస్త్ర ప్రయోగాలు విజయవంతం
Sakshi Education
దేశీయంగా రూపొందించిన యుద్ధ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలు(యాంటీ ట్యాంక్ గెడైడ్ మిస్సైల్-ఏటీజీఎమ్)... ‘హెలీనా’, ‘ధ్రువాస్త్ర’లను భారత్ విజయవంతంగా పరీక్షించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హెలీనా, ధ్రువాస్త్ర ప్రయోగాలు విజయవంతం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : భారత రక్షణ శాఖ
ఎక్కడ : ఫోఖ్రాన్, జైసల్మేర్ జిల్లా, రాజస్థాన్
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం
తద్వారా హెలీనాను ఆర్మీలోకి, ధ్రువాస్త్రను వైమానిక దళంలోకి చేర్చేందుకు మార్గం సుగమమైంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా ఫోఖ్రాన్‌లో ఫిబ్రవరి 19నాటికి ఈ క్షిపణి పరీక్షలు పూర్తయ్యాయి.
హెలీనా, ధ్రువాస్త్రల విశేషాలు...
- హెలీనా, ధ్రువాస్త్ర క్షిపణులను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది.
- అన్ని వాతావరణ పరిస్థితుల్లో, రాత్రి, పగలు కూడా శత్రు ట్యాంక్‌లపై విరుచుకుపడగలవు.
- యాంటీ ట్యాంక్ గెడైడ్ మిస్సైల్స్‌లో ఇవి మూడో తరానికి చెందినవి.
- వీటిని భూఉపరితలం, హెలికాఫ్టర్ నుంచి శత్రు ట్యాంకులపై గురిపెట్టొచ్చు.
- ఏడు కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణులు ఛేదించగలవు.
- హెలీనా క్షిపణిని సైన్యంలో, ధ్రువాస్త్ర క్షిపణిని వైమానిక దళంలో చేరుస్తారు.
- హెలీనా, ధృవాస్త్రలు లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలవు. అందుకే వీటిని ఫైర్ అండ్ ఫర్‌గెట్ మిసైల్స్ అని కూడా అంటారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హెలీనా, ధ్రువాస్త్ర ప్రయోగాలు విజయవంతం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : భారత రక్షణ శాఖ
ఎక్కడ : ఫోఖ్రాన్, జైసల్మేర్ జిల్లా, రాజస్థాన్
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం
Published date : 20 Feb 2021 05:58PM