హెచ్‌సీయూకు పీఎంఆర్‌ఎఫ్ ఇన్‌స్టిట్యూట్ హోదా
Sakshi Education
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి మరో అరుదైన గౌరవం లభించింది.

ఇప్పటికే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కు ప్రకటించగా తాజాగా ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోస్ (పీఎంఆర్‌ఎఫ్) గ్రాంటింగ్ ఇన్‌స్టిట్యూట్ హోదాను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (ఎంహెచ్‌ఆర్‌డి) శాఖ ప్రకటించింది. గత కొన్నేళ్ళుగా హెచ్‌సీయూ పనితీరు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ విభాగంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2019లో 11వ ర్యాంకింగ్ సాధించడంతో ఈ హోదాను పొందేందుకు అవకాశం కలిగింది. ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోస్ కింద ఫెలోషిప్‌లను అందించగల దేశంలోని అతికొద్ది సంస్థలలో ఒకటిగా హెచ్‌సీయూ గుర్తింపు పొందినట్లయింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హెచ్‌సీయూకు పీఎంఆర్‌ఎఫ్ గ్రాంటింగ్ ఇన్‌స్టిట్యూట్ హోదా
ఎప్పుడు : మే 28
ఎవరు : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (ఎంహెచ్‌ఆర్‌డి) శాఖ
ఎందుకు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2019లో 11వ ర్యాంకింగ్ సాధించడంతో

Published date : 29 May 2020 05:30PM