Skip to main content

హెచ్‌ఏఎల్ సీఈఓగా అమితాబ్ భట్

ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఈఓ)గా అమితాబ్ భట్ ఫిబ్రవరి 3న బాధ్యతలు చేపట్టారు.
Current Affairsఇంతకుముందు సంస్థకు చెందిన లైట్ యుటిలిటీ హెలికాప్టర్ (ఎల్‌యూహెచ్) ప్రాజెక్ట్‌కు ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్‌గా అమితాబ్ సేవలందించారు. రక్షణ రంగానికి కామోవ్ కేఏ- 226టీ హెలికాప్టర్లను అందించడం కోసం కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ఇండో రష్యన్ హెలికాప్టర్స్ లిమిటెడ్‌కు ఈయన డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. సంస్థతో 32 ఏళ్ల అనుబంధం ఉన్న అమితాబ్ హాయంలోనే ఓఎన్‌జీసీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జార్ఖండ్ ప్రభుత్వానికి హెలికాప్టర్లను అందించడంతో పాటు నేపాల్, మారిషస్ వంటి దేశాలకు ఎగుమతులు జరిగినట్లు హెచ్‌ఏఎల్ వెల్లడించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సీఈఓగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : అమితాబ్ భట్
Published date : 05 Feb 2020 05:40PM

Photo Stories