Skip to main content

హెచ్‌ఐసీసీలో ఇండియా జాయ్ 2019 ప్రారంభం

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో గేమింగ్, మీడియా, వినోద రంగాలకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద ప్రదర్శన ‘ఇండియా జాయ్ 2019’ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు నవంబర్ 20న ప్రారంభించారు.
నవంబర్ 23 వరకు జరగనున్న ఇండియా జాయ్ ప్రదర్శనలో ప్రపంచ డిజిటల్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ కార్పొరేషన్లు పాల్గొంటున్నాయి. ఈ ప్రదర్శనకు సుమారు 30 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా.

ఈ ప్రద ర్శనలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... గేమింగ్, టెక్నాలజీ, వినోద రంగాల్లో దక్షిణాసియాకు తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇంటర్నెట్ మాధ్యమంగా టీవీ, సినీ ప్రసారాలను అందించే ఓటీటీ (ఓవర్ ది టాప్) రంగం ఏటా 8 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని, ప్రస్తుతం యానిమేషన్ విభాగంలో ఓటీటీ వాటా 2.9 బిలియన్ డాలర్లుగా ఉందని వెల్లడించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇండియా జాయ్ 2019వేడుక ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు
ఎక్కడ : హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్
Published date : 21 Nov 2019 05:45PM

Photo Stories