Skip to main content

హౌజ్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభకు బోథమ్‌ ఎన్నిక

ఇంగ్లండ్‌ క్రికెట్‌ దిగ్గజం ఇయాన్ బోథమ్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్‌ పార్లమెంట్‌ హౌజ్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభలో సభ్యునిగా 64 ఏళ్ల బోథమ్‌ ఎన్నికయ్యాడు.
Edu news

తాజాగా 36 మందిని ప్రభుత్వం ఈ సభకు ఎంపిక చేయగా అందులో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ బోథమ్‌కు కూడా చోటు దక్కింది. 2011లో ఇంగ్లండ్‌ మహిళల కెప్టెన్ రాచెల్‌ ఫ్లింట్‌ తర్వాత ఈ గౌరవం పొందిన తొలి క్రికెటర్‌ బోథమ్‌ కావడం విశేషం. ఇంగ్లండ్‌ తరఫున 1977–1992 మధ్య కాలంలో 102 టెస్టులు ఆడిన బోథమ్‌...1981లో ఆసీస్‌ను ఓడించి యాషెస్‌ సిరీస్‌ దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.

భారత్-చైనా మధ్య ఐదో దఫా చర్చలు
వాస్తవాదీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనా భూభాగం వైపు భారత్‌–చైనా సీనియర్‌ సైనిక కమాండర్ల మధ్య ఆగస్టు 2న 11 గంటలపాటు సుదీర్ఘంగా ఐదో దఫా చర్చలు జరిగాయి. చర్చల్లో భారత్‌ తరపు బృందానికి లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌ నేతృత్వం వహించారు. తూర్పు లద్ధాఖ్‌లోని పాన్ గాంగ్‌ త్సో నుంచి సాధ్యమైనంత త్వరగా చైనా సైనికులు వెనక్కి తగ్గితేనే సరిహద్దుల్లో శాంతి సాధ్యమని భారత అధికారులు స్పష్టం చేశారు. మే 5వ తేదీ ముందు నాటి పరిస్థితిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరో రెండు వివాదాస్పద ప్రాంతాల్లో తిష్టవేసిన చైనా బలగాలు సైతం వెనక్కి వెళ్లాలని డిమాండ్‌ చేసింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి
: . బ్రిటిష్‌ పార్లమెంట్‌ హౌజ్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభలో సభ్యునిగా ఎన్నిక
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : ఇంగ్లండ్‌ క్రికెట్‌ దిగ్గజం ఇయాన్ బోథమ్‌
Published date : 04 Aug 2020 12:08AM

Photo Stories