Skip to main content

హైడ్రాక్సీక్లోరోక్విన్ క్లినికల్ ట్రయల్స్‌పై నిషేధం

కరోనా కట్టడి కోసం వినియోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మే 25న ప్రకటించింది.
Current Affairsఈ డ్రగ్ వాడకం వల్ల కోవిడ్-19 రోగుల చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉందంటూ లాన్సెట్ నివేదిక వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం ఈ యాంటీ మలేరియా డ్రగ్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. సాలిడారిటీ ట్రయల్ అని పిలవబడే ఎగ్జిక్యూటివ్ గ్రూప్‌లో అనేక దేశాల్లోని వందలాది ఆస్పత్రులు కరోనా పేషంట్లను చేర్చుకుని వారి మీద రకరకాల ప్రయోగాలు జరుపుతున్నారు. అరుుతే ముందు జాగ్రత్త చర్యగా వీరికి హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్‌ను వాడుతున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
హైడ్రాక్సీక్లోరోక్విన్ క్లినికల్ ట్రయల్స్‌పై నిషేధం
ఎప్పుడు : మే 25
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)
ఎందుకు : ఈ డ్రగ్ వాడకం వల్ల కోవిడ్-19 రోగుల చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉందని
Published date : 27 May 2020 05:55PM

Photo Stories