Skip to main content

హైదరాబాద్‌లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ

హైదరాబాద్‌లో 2019 అక్టోబర్ 11, 12 తేదీల్లో ‘వరల్డ్ డిజైన్ అసెంబ్లీ’ నిర్వహించనున్నారు.
రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సు ద్వారా పారిశ్రామిక డిజైనింగ్ రంగంలో సృజనాత్మకత పెరుగుతుందని భావిస్తున్నారు. 31వ ద్వైవార్షిక వరల్డ్ డిజైన్ అసెంబ్లీని హైదరాబాద్‌లో నిర్వహిస్తామని 2018 జూలైలో వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీఓ) అధ్యక్షులు లూయిసా బొషిటో ప్రకటించారు.

ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా 1957లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ సొసైటీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైన్ (ఐసీఎస్‌ఐడీ) ఏర్పాటైంది. తొలుత 12 వృత్తి నైపుణ్యం కలిగిన డిజైన్ అసోసియేషన్లతో ఏర్పాటైన ఐసీఎస్‌ఐడీ 2015 అక్టోబర్‌లో వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్‌గా నామాంతరం చెందింది. ప్రపంచవ్యాప్తంగా 140 డిజైన్ అసోసియేషన్లు డబ్ల్యూడీఓలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో సృజనాత్మకతను ప్రోత్సహించడం, నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందించేలా పారిశ్రామిక నమూనాలు తయారు చేయడం తదితరాలు లక్ష్యంగా వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి రెండేళ్లకోసారి వరల్డ్ డిజైన్ క్యాపిటల్ పేరిట ఒక్కో నగరాన్ని ఎంపిక చేసి సదస్సులు నిర్వహిస్తోంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వరల్డ్ డిజైన్ అసెంబ్లీ
ఎప్పుడు : 2019 అక్టోబర్ 11, 12 తేదీల్లో
ఎక్కడ : హైదరాబాద్
Published date : 17 May 2019 05:25PM

Photo Stories