హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్స్ కేంద్రం ఏర్పాటు
Sakshi Education
వైద్య ఉపకరణాల తయారీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ‘మెడ్‌ట్రానిక్స్’సంస్థ హైదరాబాద్‌లో రూ.1,200 కోట్లతో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని(ఆర్ అండ్ డీ సెంటర్) ఏర్పాటు చేస్తున్నట్లు ఆగస్టు 11న వెల్లడించింది.
ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ఒమర్ ఇస్రాక్‌తో జరిగిన వర్చువల్ భేటీలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు మాట్లాడారు. మెడ్‌ట్రానిక్స్‌తో కుదిరిన ఒప్పందం ద్వారా మెడికల్ టెక్నాలజీ రంగంలో మరిన్ని పెట్టుబడులతో పాటు ఉద్యోగాల కల్పన జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
అమెరికా బయట అతిపెద్ద సెంటర్
మెడ్‌ట్రానిక్స్ పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా ఆ సంస్థతో చర్చలు కొనసాగిస్తూ వచ్చింది. గతంలో అమెరికా పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ మెడ్‌ట్రానిక్స్ చైర్మన్ ఇస్రాక్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమెరికా బయట అతిపెద్ద ఆర్‌అండ్‌డీ సెంటర్ ఏర్పాటుకు ఆయన సంసిద్ధత వ్యక్తంచేశారు. ప్రస్తుత ఒప్పందం ద్వారా వచ్చే ఐదేళ్లలో మెడ్‌ట్రానిక్స్ రూ.1200 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని(ఆర్ అండ్ డీ సెంటర్) ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : మెడ్‌ట్రానిక్స్ సంస్థ
ఎక్కడ : హైదరాబాద్

Published date : 12 Aug 2020 05:46PM