Skip to main content

హైదరాబాద్‌లో ఇండియా జాయ్ వేడుక

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో 2019, నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు ‘ఇండియా జాయ్-2019’వేడుకను నిర్వహించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం సహకారంతో తెలంగాణ వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ) నిర్వహిస్తున్న ఈ వేడుకలో 9 అంశాలపై సదస్సులు జరపనున్నారు. డిజిటల్ మీడియా, వినోదం రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పలు సంస్థలు ఈ వేడుకలో పాల్గొననున్నాయి. ఇండియా జాయ్-2019 సంద ర్భంగా గేమింగ్, వినోదం తదితర రంగాల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ‘ఇమేజ్ టవర్స్’కు ప్రచారం కల్పించనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2019, నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు ‘ఇండియా జాయ్-2019’వేడుక
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : తెలంగాణ వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ)
ఎక్కడ : హైటెక్ సిటీ, హైదరాబాద్
Published date : 12 Nov 2019 05:39PM

Photo Stories