హైదరాబాద్‌లో ఎంఫసిస్ ఎక్సలెన్స్ సెంటర్
Sakshi Education
ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ఎంఫసిస్ హైదరాబాద్‌లోని రాయదుర్గంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసింది.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల కోసం ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సెప్టెంబర్ 27న ప్రారంభించారు. ఈ నూతన సెంటర్‌తో హైదరాబాద్‌లో ఎంఫసిస్ ఆఫీసుల సంఖ్య రెండుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎంఫసిస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : రాయదుర్గం, హైదరాబాద్
ఎందుకు : బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల కోసం

Published date : 28 Sep 2019 05:24PM