హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియన్ సెంటర్ ఏర్పాటు
Sakshi Education
ఐర్లాండ్‌కు చెందిన డేటా, అనలిటిక్స్ కంపెనీ ఎక్స్‌పీరియన్.. ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది.
హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ వద్ద 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పారు. ప్రస్తుతం 200 మంది ఇంజనీర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. 2024 నాటికి ఉద్యోగుల సంఖ్యను 2,500 స్థాయికి తీసుకు వెళ్లనున్నట్టు కంపెనీ తెలిపింది. తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ కేంద్రాన్ని ఫిబ్రవరి 4న ప్రారంభించారు.
యాక్సెంచర్ హబ్ కూడా...
ప్రొఫెషనల్, కన్సల్టింగ్ సర్వీసుల్లో ఉన్న అమెరికన్ కంపెనీ యాక్సెంచర్ హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేసింది. 3,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పారు. భాగ్యనగరి సెంటర్‌లో 2,000 మంది ఉద్యోగులు ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. ఈ కేంద్రంలో డిజిటల్ ఎకానమీకి అవసరమైన ఉత్పత్తులు, సేవలను యాక్సెంచర్‌తో కలిసి క్లయింట్లు ఆవిష్కరించాల్సి ఉంటుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సంస్థ తొలి నానో ల్యాబ్ ఒక్కడ కొలువుదీరింది. సంస్థకు ఇప్పటికే ఇన్నోవేషన్ హబ్ బెంగళూరులో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : డేటా, అనలిటిక్స్ కంపెనీ ఎక్స్‌పీరియన్
ఎక్కడ : హైదరాబాద్

Published date : 05 Feb 2020 05:45PM