హైదరాబాద్ గ్రిడ్ పాలసీకి ఆమోదం
Sakshi Education
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలు ఒకేచోట కాకుండా నగరం నలువైపులా విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా ఐటీ పరిశ్రమల కారిడార్‌గా పేరొందిన పశ్చిమ ప్రాంతంలో మినహా ఇతర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు పెట్టేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రతిపాదిత హైదరాబాద్ గ్రిడ్ పాలసీని కేబినెట్ ఆగస్టు 5న ఆమోదించింది. 2019–20లో హైదరాబాద్ 18 శాతం వృద్ధి రేటుతో రూ.1,18,000 కోట్ల ఐటీ ఎగుమతులను సాధించగా, ఇందులో 90 శాతం పశ్చిమ కారిడార్ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, వీటి పరిసర ప్రాంతాల నుంచే వచ్చాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి :హైదరాబాద్ గ్రిడ్ పాలసీకి ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : తెలంగాణ కేబినెట్
ఎందుకు :రాజధాని హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలు ఒకేచోట కాకుండా నగరం నలువైపులా విస్తరించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి :హైదరాబాద్ గ్రిడ్ పాలసీకి ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : తెలంగాణ కేబినెట్
ఎందుకు :రాజధాని హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలు ఒకేచోట కాకుండా నగరం నలువైపులా విస్తరించేందుకు
Published date : 07 Aug 2020 03:57PM