హాప్‌మన్ కప్ విజేత ఫెడరర్-బెన్సిచ్ జట్టు
Sakshi Education
అంతర్జాతీయ మిక్స్‌డ్ టెన్నిస్ టోర్నమెంట్ హాప్‌మన్ కప్ విజేతగా రోజర్ ఫెడరర్-బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) జట్టు నిలిచింది.
ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జనవరి 5న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్-బెన్సిచ్ ద్వయం 2-1తో అలెగ్జాండర్ జ్వెరెవ్-ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) జట్టుపై విజయం సాధించింది. దీంతో మూడుసార్లు హాప్‌మన్ టైటిల్ గెలిచిన తొలి ప్లేయర్‌గా ఫెడరర్ రికార్డు నెలకొల్పాడు. 2001లో మార్టినా హింగిస్‌తో కలిసి తొలిసారి టైటిల్ సాధించిన ఫెడరర్, 2018లో బెన్సిచ్‌తో కలిసి ఈ ఘనత సాధించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హాప్‌మన్ కప్ విజేత
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : రోజర్ ఫెడరర్-బెలిండా బెన్సిచ్ జట్టు
ఎక్కడ : పెర్త్, ఆస్ట్రేలియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : హాప్‌మన్ కప్ విజేత
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : రోజర్ ఫెడరర్-బెలిండా బెన్సిచ్ జట్టు
ఎక్కడ : పెర్త్, ఆస్ట్రేలియా
Published date : 07 Jan 2019 04:06PM