హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలిచిన చివరి పత్రిక?
Sakshi Education
హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య డిమాండ్‌కు మద్దతుగా నిలిచిన చివరి పత్రిక ‘యాపిల్ డైలీ’ మూతపడింది.
జూన్ 24న ఆ పత్రిక చివరి సంచిక వెలువడింది. మొత్తం 10 లక్షల కాపీలు గంటల వ్యవధిలోనే అమ్ముడయ్యాయి. అర్ధ స్వయంప్రతిపత్తి కలిగిన హాంకాంగ్‌పై పూర్తిగా పట్టుబిగించేందుకు డ్రాగన్ దేశం చైనా పావులు కదుపుతోంది. హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమాలను కఠినంగా అణచివేస్తోంది.
జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించేలా విదేశీ శక్తులతో కలిసి పనిచేస్తోందంటూ యాపిల్ డైలీపై చైనా పాలకులు కన్నెర్ర చేశారు. 2.3 మిలియన్ డాలర్ల విలువైన యాపిల్ డైలీ ఆస్తులను స్తంభింపజేశారు. ఈ నేపథ్యంలో ఇక పత్రికను మూసివేయడమే శరణ్యమని యాపిల్ డైలీ యజమానులు నిర్ణయాని కొచ్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హాంకాంగ్ ప్రజాస్వామ్య డిమాండ్‌కు మద్దతుగా నిలిచిన చివరి పత్రిక ‘యాపిల్ డైలీ’ మూత
ఎప్పుడు : జూన్ 24
ఎక్కడ : హాంకాంగ్
ఎందుకు : యాపిల్ డైలీ ఆస్తులను చైనా స్తంభింపజేయడంతో...

Published date : 25 Jun 2021 06:30PM