హామిల్టన్‌కు మొనాకో గ్రాండ్‌ప్రి టైటిల్
Sakshi Education
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మొనాకో గ్రాండ్‌ప్రి టైటిల్ గెలుచుకున్నాడు.

మొనాకోలో మే 26న జరిగిన ఈ ఫార్ములావన్ రేసులో హామిల్టన్ 78 ల్యాప్‌లను గంటా 43 నిమిషాల 28.437 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానంలో, వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది నాలుగో టైటిల్ కాగా... మెర్సిడెస్ జట్టుకు ఆరో విజయం కావడం విశేషం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన ఆరు రేసుల్లోనూ మెర్సిడెస్ డ్రైవర్లే విజేతగా నిలిచారు. మొనాకో విజయాన్ని ఫార్ములావన్ దిగ్గజం నికీ లాడా (ఆస్ట్రియా)కు హామిల్టన్ అంకితం ఇచ్చాడు. మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నికీ లాడా మే 20న మృతి చెందారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మొనాకో గ్రాండ్‌ప్రి టైటిల్ విజేత
ఎప్పుడు : మే 26
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : మొనాకో గ్రాండ్‌ప్రి టైటిల్ విజేత
ఎప్పుడు : మే 26
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్
Published date : 27 May 2019 05:54PM