హామిల్టన్ కు స్పానిష్ గ్రాండ్‌ప్రి టైటిల్
Sakshi Education
స్పానిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు.
స్పెయిన్ లోని బార్సిలోనా నగరంలో ఆగస్టు 16న జరిగిన ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన హామిల్టన్ 66 ల్యాప్‌ల దూరాన్ని అందరికంటే ముందుగా గంటా 31 నిమిషాల 45.279 సెకన్లలో చేరి చాంపియన్ గా అవతరించాడు. హామిల్టన్ కెరీర్‌లో ఇది 88వ విజయం కావడం విశేషం. రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ రెండో స్థానంలో, మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ మూడో స్థానంలో నిలిచారు. సీజన్ లో ఆరు రేసులు ముగిశాక డ్రైవర్స్ చాంపియన్ షిప్‌లో హామిల్టన్ 132 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సీజన్ లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి ఆగస్టు 30న జరుగనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్పానిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) టైటిల్ విజేత
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ :బార్సిలోనా, స్పెయిన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్పానిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) టైటిల్ విజేత
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ :బార్సిలోనా, స్పెయిన్
Published date : 17 Aug 2020 05:37PM