హాకీ ఇండియా డైరెక్టర్ డేవిడ్ రాజీనామా
Sakshi Education
2021 ఏడాది సెప్టెంబర్ వరకు కాంట్రాక్ట్ పొడిగించినా... హాకీ ఇండియా (హెచ్‌ఐ) హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ డేవిడ్ జాన్ (ఆస్ట్రేలియా) తన పదవికి రాజీనామా చేశారు.
వ్యక్తిగత, ఆరోగ్య కారణాలరీత్యానేతానీ నిర్ణయం తీసుకున్నానని ఆగస్టు 21న డేవిడ్ జాన్ వివరించారు. నెలకు 12 వేల డాలర్ల (రూ. 9 లక్షలు) వేతనం అందుకుంటున్న డేవిడ్ జాన్ మార్చిలో లాక్‌డౌన్ప్రారంభమైనప్పటి నుంచి న్యూఢిల్లీలోని తన ఇంట్లో నుంచి పని చేస్తున్నారు. అయితే మే నెలలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో హెచ్‌ఐ కార్యాలయం మూతబడింది. 2016 నుంచి హాకీ ఇండియా హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డేవిడ్ జాన్ పదవీకాలం 2021 సెప్టెంబర్ వరకు ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హాకీ ఇండియా (హెచ్‌ఐ) హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ రాజీనామా
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు :డేవిడ్ జాన్
ఎందుకు :వ్యక్తిగత, ఆరోగ్య కారణాలరీత్యా
క్విక్ రివ్యూ :
ఏమిటి : హాకీ ఇండియా (హెచ్‌ఐ) హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ రాజీనామా
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు :డేవిడ్ జాన్
ఎందుకు :వ్యక్తిగత, ఆరోగ్య కారణాలరీత్యా
Published date : 24 Aug 2020 07:58PM