హాక్ జెట్ తొలి మహిళా పైలట్‌గా మోహనా
Sakshi Education
అత్యాధునిక హాక్ యుద్ధవిమానాన్ని పగటిపూట నడిపిన తొలి మహిళాపైలట్‌గా ఫ్లైట్ లెఫ్టినెంట్ మోహనా సింగ్ రికార్డు నెలకొల్పారు.
బెంగాల్‌లోని కలైకుండా వాయుసేన కేంద్రంలో మోహనాసింగ్ శిక్షణను పూర్తిచేసుకున్నట్లు రక్షణశాఖ తెలిపింది. శిక్షణలో రాకెట్ల ప్రయోగం, బాంబులు జారవిడవడం, లక్ష్యాలను గురిచూసి కాల్చడం వంటి ప్రక్రియల్ని పూర్తిచేశారు. ఆమెకు 500 గంటలకుపైగా ఫ్లయింగ్ అనుభవం ఉండగా, ఇందులో 380 గంటలు హాక్ ఎంకే-132 జెట్‌ను నడిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హాక్ జెట్ తొలి మహిళా పైలట్ గా గుర్తింపు
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : మోహనా సింగ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : హాక్ జెట్ తొలి మహిళా పైలట్ గా గుర్తింపు
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : మోహనా సింగ్
Published date : 03 Jun 2019 05:53PM