Skip to main content

గ్వాటెమాలా పార్లమెంట్ భవనానికి నిప్పు

ఉత్తర అమెరికా ఖండంలోని గ్వాటెమాలా దేశ బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు నిధుల కేటాయింపులను భారీగా తగ్గించడాన్ని ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Current Affairs వందలాది మంది జనం వీధుల్లోకి వచ్చి, అధ్యక్షుడు అలెజాండ్రో గియామతీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. నవంబర్ 21న దాదాపు 7 వేల మంది ప్రజలు రాజధాని గ్వాటెమాలా సిటీలోని కాంగ్రెస్ (పార్లమెంట్) భవనాన్ని ముట్టడించారు. కాంగ్రెస్ భవనానికి జనం నిప్పు పెట్టారు. ఈ ఘటనలో భవనంలోని కొంతభాగం దహనమైంది.

గ్వాటెమాలా రాజధాని: గ్వాటెమాలా సిటీ; కరెన్సీ: క్వెట్జల్

క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్వాటెమాలా పార్లమెంట్(కాంగ్రెస్) భవనానికి నిప్పు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : గ్వాటెమాలా ప్రజలు
ఎక్కడ : గ్వాటెమాలా సిటీ
ఎందుకు : దేశ బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు నిధుల కేటాయింపులను భారీగా తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ...
Published date : 24 Nov 2020 06:41PM

Photo Stories