Skip to main content

గుజరాత్ హైకోర్టు సీజేగా విక్రమ్‌నాథ్

గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్‌నాథ్‌ను నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ సెప్టెంబర్ 8న ఉత్తర్వులు జారీచేసింది.
ప్రస్తుతం విక్రమ్‌నాథ్ అలహాబాద్ హైకోర్టులో జడ్జీగా పనిచేస్తున్నారు. జస్టిస్ విక్రమ్‌నాథ్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం 2019, ఏప్రిల్‌లో సిఫార్సు చేసింది. అయితే ఈ నియామకానికి మోకాలడ్డిన కేంద్రం ఆయన పేరును తిప్పిపంపింది. దీంతో జస్టిస్ విక్రమ్‌నాథ్‌ను గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం ఆగస్టు 22న తీర్మానించింది. దీంతో కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. గుజరాత్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి పదవి దాదాపు ఏడాది కాలంగా ఖాళీగానే ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియావకం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : జస్టిస్ విక్రమ్‌నాథ్
Published date : 09 Sep 2019 05:46PM

Photo Stories