గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించనున్న స్వతంత్ర సంస్థ?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని 28 దేవాలయాల్లో ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు నిర్ణయించింది.
హిందూ ధర్మ ప్రచార పరిషత్, టీటీడీ ఎస్వీ గోసంరక్షణశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఏపీలోని 13 జిల్లాలు, తెలంగాణలోని పాత 10 జిల్లాల్లో... జిల్లాకు ఒక ఆలయం చొప్పున, కర్ణాటకలోని 5 దేవాలయాల్లో కలిపి మొత్తం 28 ఆలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రసుత్తం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.
కర్ణాటక భవన సముదాయాల నిర్మాణానికి భూమి పూజ
2008 ఏడాదిలో టీటీడీ తిరుమలలోని కర్ణాటక చారిటీస్‌కు 7.05 ఎకరాల భూమిని 50 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ఈ స్థలంలో రూ.200 కోట్లతో నూతన వసతి సముదాయాల నిర్మాణం చేపట్టడానికి 2020, జూలైలో కర్ణాటక ప్రభుత్వం, టీటీడీ మధ్య అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మించనున్న వసతి సముదాయాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సెప్టెంబర్ 24న భూమి పూజ చేశారు. టీటీడీ ఈ నిర్మాణాలు పూర్తి చేసి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించనున్న స్వతంత్ర సంస్థ
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక

Published date : 25 Sep 2020 05:28PM