Skip to main content

గ్రీన్ ఎయిర్‌పోర్టు అవార్డును గెలుచుకున్న విమానాశ్రయం

పర్యావరణ హితమైన కార్యకలాపాలతో ఇప్పటికే మూడుసార్లు గ్రీన్ ఎయిర్‌పోర్టు విభాగంలో అవార్డు దక్కించుకున్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(శంషాబాద్ ఎయిర్‌పోర్టు).. మరోసారి ఘనత సాధించింది.
Current Affairs
ఆసియా పసిఫిక్‌ విభాగంలో ఏటా 25 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విమానాశ్రయాల కేటగిరీలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు గ్రీన్ఎయిర్‌పోర్టు గోల్డెన్అవార్డు’నుఅంతర్జాతీయ విమానాశ్రయ మండలి అందజేసిందని ఎయిర్‌పోర్టువర్గాలు జూన్ 3న వెల్లడించాయి.విమానాశ్రయం పరిసరాల్లో వాయు నాణ్యత మెరుగుపర్చడం, సౌరశక్తి వినియోగం, ఇంధనాన్ని ఆదా చేయడం, వాయు ఉద్గారాలను తగ్గించేందుకు తీసుకున్న చర్యల ఆధారంగా ఈ అవార్డును అందజేశారని వెల్లడించాయి.శంషాబాద్ ఎయిర్‌పోర్టును జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్(గెయిల్‌) నిర్వహిస్తోంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి :గ్రీన్ఎయిర్‌పోర్టు గోల్డెన్అవార్డునుగెలుచుకున్నవిమానాశ్రయం?
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(శంషాబాద్ ఎయిర్‌పోర్టు)
ఎందుకు :విమానాశ్రయం పరిసరాల్లో వాయు నాణ్యత మెరుగుపర్చడం, సౌరశక్తి వినియోగం, ఇంధనాన్ని ఆదా చేయడం, వాయు ఉద్గారాలను తగ్గించేందుకు తీసుకున్న చర్యల ఆధారంగా...
Published date : 05 Jun 2021 12:42PM

Photo Stories