గ్రెటా థన్‌బర్గ్‌కు మానవ హక్కుల పురస్కారం
Sakshi Education
స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక మానవ హక్కుల పురస్కారం ‘అంబాసిడర్ ఆఫ్ కన్సైన్స్’ లభించింది.
పర్యావరణానికి హాని కలిగించే వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలంటూ 2018 ఏడాది ఆగస్టులో స్వీడన్ పార్లమెంట్ ఎదుట 16 ఏళ్ల థన్‌బర్గ్ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ క్లైమేట్ స్టర్యిక్ మూవ్‌మెంట్’ను ప్రారంభించింది. ప్రతి శుక్రవారం పర్యావరణ పరిరక్షణకు కృషి చేసేందుకు ప్రారంభించిన ఈ ఉద్యమం బ్రెజిల్, ఉగాండా తదితర దేశాలకు విస్తరించి కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిచ్చింది.
మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తులను, బృందాలను గౌరవించాలన్న ఉద్దేశంతో 2002లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ పురస్కారాన్ని నెలకొల్పింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంబాసిడర్ ఆఫ్ కన్సైన్స్ పురస్కారం
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : గ్రెటా థన్‌బర్గ్
ఎందుకు : పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు

Published date : 08 Jun 2019 06:27PM