గ్రేటర్ నోయిడాలో పోలీస్ వర్సిటీ
Sakshi Education
ప్రపంచ స్థాయిలో జాతీయ పోలీస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా-ఎన్‌సీఆర్‌లోని ఐటీ పార్క్‌లో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సెప్టెంబర్ 19న తెలిపింది. పోలీస్ వర్సిటీ కోసం గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ రూ.371 కోట్లకు 90 ఏళ్లు స్థలాన్ని లీజుకు ఇచ్చిందని చెప్పింది. వర్సిటీ ద్వారా పోలీస్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ ఫోరెన్సిక్, క్రిమినల్ జస్టిస్, క్రిమినాలజి, రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో విద్య, శిక్షణ అందిస్తామని పేర్కొంది. డిగ్రీ, మాస్టర్స్, పీహెచ్‌డీతోపాటు పీజీ డిప్లొమా కోర్సులు ఉంటాయని వివరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రేటర్ నోయిడాలో పోలీస్ వర్సిటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : కేంద్ర హోం శాఖ
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రేటర్ నోయిడాలో పోలీస్ వర్సిటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : కేంద్ర హోం శాఖ
Published date : 20 Sep 2019 05:40PM