Skip to main content

గర్భవిచ్ఛిత్తి సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

గర్భవిచ్ఛిత్తి సవరణ బిల్లు-2020కు లోక్‌సభ మార్చి 17న ఆమోదం తెలిపింది.
Current Affairsఅత్యాచార బాధితులు, మైనర్లు, దివ్యాంగుల వంటి ప్రత్యేక కేటగిరీలోకి వచ్చే మహిళలు ఇకపై 24 వారాల గర్భంతో ఉన్నప్పుడు కూడా గర్భస్రావం చేయించుకునేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.

భారత్‌లో మూడో మరణం
భారత్‌లో మార్చి 17న మూడో కరోనా మరణం నమోదైంది. ముంబైలో 63 ఏళ్ల వ్యక్తి ఈ వైరస్ బారిన పడి మరణించారు. ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చిన ఆ వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 39 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో కేరళ(26 కేసులు) ఉంది. హరియాణా, యూపీలో చెరో 15, ఢిల్లీలో 8, లద్దాఖ్‌లో 6, కశ్మీర్‌లో 3 కేసులు కరోనా పాజిటివ్‌గా తేలాయి. దేశవ్యాప్తంగా మార్చి 17 నాటికి కోవిడ్ బాధితుల సంఖ్య 137కి పెరిగింది.

ఎవరూ రాకూడదు...
అఫ్గానిస్తాన్, ఫిలిప్పైన్స్, మలేసియాల నుంచి మార్చి 31 వరకు భారత్‌కు ఎవరూ రాకూడదని ప్రభుత్వం నిషేధం విధించింది. యూరోపియన్ యూనియన్ దేశాలు, టర్కీ, బ్రిటన్‌ల నుంచి ప్రయాణికులను భారత్ ఇప్పటికే నిషేధించిన విషయం తెలిసిందే. మరోవైపు కరోనా కట్టడికి రూ. 200 కోట్లతో ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు పశ్చిమబెంగాల్ సీఎం మమత ప్రకటించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
గర్భవిచ్ఛిత్తి సవరణ బిల్లు-2020కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ప్రత్యేక కేటగిరీలోకి వచ్చే మహిళలు ఇకపై 24 వారాల గర్భంతో ఉన్నప్పుడు కూడా గర్భస్రావం చేయించుకునేందుకు వీలుగా
Published date : 18 Mar 2020 06:25PM

Photo Stories