Skip to main content

గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల పెంపు

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల పెంపు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వ‌చ్చింది.
Current Affairs

ప్రస్తుతం ఉన్న రూ.182 వేతనం రూ.202కి పెరిగింది. కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు అమలు చేస్తున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పేదలు ఇబ్బంది పడకుండా ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పేరుతో రూ.1.7 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే మూడు నెలలపాటు ఈ ప్యాకేజీని అమలు చేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 26న వెల్లడించారు.

ఆర్థిక మంత్రి ప్రకటించిన సహాయ చర్యల కోసం క్లిక్ చేయండి

క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల పెంపు
ఎప్పుడు : ఏప్రిల్‌ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశ వ్యాప్తంగా
ఎందుకు : ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో భాగంగా

Published date : 02 Apr 2020 12:08PM

Photo Stories