గ్రామీణ ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేసేందుకు ప్రధాని ప్రారంభించిన పథకం?
Sakshi Education
గ్రామీణ ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన ‘సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(స్వామిత్వ)’ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 11న న్యూఢిల్లీలో ప్రారంభించారు.
అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ... ఈ పథకం గ్రామీణ భారతాన్ని మార్చే విప్లవాత్మక కార్యక్రమం అని, ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా కీలక ముందడుగు అని పేర్కొన్నారు.
స్వామిత్వ పథకం-ప్రధానాంశాలు
ఏమిటి : సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(స్వామిత్వ)పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : యూపీ, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక
ఎందుకు : గ్రామీణ ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేసేందుకు
స్వామిత్వ పథకం-ప్రధానాంశాలు
- స్వామిత్వ కార్డులను ఉపయోగించి పల్లె ప్రజలు బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చ.
- ఆస్తి కార్డుల ద్వారా బ్యాంక్ ఖాతాలను, విద్యుత్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, పక్కా ఇల్లు తదితర సౌకర్యాలు పొందవచ్చు.
- ప్రస్తుతం యూపీ, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 763 గ్రామాల్లో స్వామిత్వ ప్రారంభమైంది.
- ప్రతీ కార్డుకు ఆధార్ కార్డు తరహాలో ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది.
- ఆస్తి కార్డుల ద్వారా గ్రామస్తుల మధ్య భూ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తి తగాదాలు తొలగిపోతాయి.
- ప్రజలు తమ ఆస్తులపై స్పష్టమైన యాజమాన్య హక్కులు కలిగి ఉండటం అవసరం.
- గ్రామాల్లోని యువత ఈ ప్రాపర్టీ కార్డులను హామీగా పెట్టి, స్వయం ఉపాధి కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు.
- దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీతో భూముల మ్యాపింగ్ చేయాలని యోచిస్తున్నాం.
- ఈ 763 గ్రామాల్లోని ప్రజలు తక్షణం అవసరమనుకుంటే తమ ఫోన్లకు అధికారులు ఎస్‌ఎంఎస్ చేసిన లింక్ ద్వారా ప్రాపర్టీ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆస్తి కార్డుల పంపిణీని త్వరలో ప్రారంభిస్తారుు.
- రానున్న మూడు, నాలుగేళ్లలో ప్రతీ కుటుంబానికి ప్రాపర్టీ కార్డులను అందజేస్తాం.
- ప్రపంచవ్యాప్తంగా తమ ఆస్తులకు సంబంధించి చట్టబద్ధమైన రికార్డులు ఉన్నవారు మూడింట ఒక వంతు మాత్రమే.
ఏమిటి : సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(స్వామిత్వ)పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : యూపీ, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక
ఎందుకు : గ్రామీణ ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేసేందుకు
Published date : 12 Oct 2020 06:03PM