Skip to main content

గ్రామీణ ప్రజల కోసం టీ కన్సల్ట్ యాప్‌ను రూపొందంచిన సంస్థ?

కరోనా సమయంలో గ్రామీణ ప్రాంత ప్రజల కోసం <b>తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా)</b> రూపొందించిన <b>‘టీ కన్సల్ట్’</b> యాప్‌నకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది.
Current Affairs‘ఎక్సలెన్స్ ఇన్ రెస్పాన్స్ టు కోవిడ్ కేటగిరీ’ కింద ఈ అవార్డు దక్కింది. ఢిల్లీలో డిసెంబర్ 22న జరిగిన 69వ స్కోచ్ సదస్సులో నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన ఈ అవార్డును స్వీకరించారు. లాక్‌డౌన్ సమయంలో వైద్య సేవల కోసం గ్రామీణులు పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్‌లో ఉచిత వైద్య సేవలు అందేలా ఈ యాప్‌ను రూపొందించారు.

ఆదర్శ్ విద్యా సరస్వతి రాష్ట్రీయ పురస్కార్ విజేత?
జగిత్యాల జిల్లా కోరుట్లలోని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న లాకావత్ రాంసింగ్‌కు ప్రతిష్టాత్మక ‘ఆదర్శ్ విద్యా సరస్వతి రాష్ట్రీయ పురస్కార్ అవార్డు-2020’ లభించింది. ఈ అవార్డును గ్లోబల్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్, గ్లేసియర్ జర్నల్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు ప్రధానం చేశారు.
Published date : 23 Dec 2020 06:07PM

Photo Stories