Skip to main content

గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రత్యేక శాఖ

గ్రామ, వార్డు సచివాలయాలను మరింత సమర్థవంతంగా పని చేయించేందుకు ప్రత్యేకంగా ‘గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ’ను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని డిసెంబర్ 21న ఉత్తర్వులు జారీ చేశారు.
Current Affairsప్రభుత్వ బిజినెస్ రూల్స్ ఒకటవ షెడ్యూల్‌లో ఈ శాఖను చేర్చనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులతో సంబంధిత శాఖల మధ్య మరింత సమన్వయం పెంచేందుకు ఈ శాఖ పనిచేస్తుంది. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు అవసరమైన సమగ్ర శిక్షణ ఇచ్చి వారంతా విధులు, బాధ్యతలు, జవాబుదారీతనాన్ని పాటించేలా ఈ శాఖ చూస్తుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నూతనంగా గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : గ్రామ, వార్డు సచివాలయాలను మరింత సమర్థవంతంగా పని చేయించేందుకు
Published date : 23 Dec 2019 05:40PM

Photo Stories