Skip to main content

గోవుల్లో ఒత్తిడి కోసం కొత్త విధానం

గోవుల్లో ఒత్తిడిస్థాయిని తెలుసుకునేందుకు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని కనుగొన్నారు.
ఈ విధానం ద్వారా గోవుల వెంట్రుకలను పరీక్షించడం ద్వారా ఒత్తిడిని నిర్ధారించవచ్చు. ఇప్పటివరకు పశువుల రక్తం, మూత్రం, మలాన్ని సేకరించి అందులోని హార్మోన్ల పెరుగుదల ఆధారంగా వాటి శారీరక ఒత్తిడి తీవ్రతను గుర్తిస్తున్నారు. సీసీఎంబీకి చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ ఉమాపతి, డాక్టర్ వినోద్‌కుమార్, హిమాచల్‌ప్రదేశ్ వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అరవింద్, ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్‌లోని ప్రొఫెసర్ క్‌లైవ్ ఈ ప్రయోగాలు చేపట్టారు. పశువుల శారీరక ఒత్తిడికి కారణమైన కాట్రిసోల్ హార్మోన్‌లు గోవుల వెంట్రుకల్లో అధికంగా ఉన్నట్లు ఈ ప్రయోగాల్లో గుర్తించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
గోవుల్లో ఒత్తిడి కోసం కొత్త విధానం
ఎప్పుడు : మే 20
ఎవరు : సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు
Published date : 21 May 2019 05:45PM

Photo Stories