గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారానికి ఎంపికైన గవర్నర్?
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రతిష్టాత్మక గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 పురస్కారానికి ఎంపికయ్యారు.
సమాజహితం కోసం అత్యున్నత సేవలు చేసినందుకుగాను తమిళిసైను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. యూఎస్ కాంగ్రెస్ మ్యాన్ డానికే డేవిస్ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ ఈ అవార్డును ప్రకటించింది. తమిళిసైతో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మందికి ఈ గౌరవ పురస్కారం దక్కింది. 9వ వార్షిక కాంగ్రెషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా 2021, మార్చి 7న అమెరికా నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డును అందజేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 పురస్కారానికి ఎంపిక
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
ఎందుకు : సమాజహితం కోసం అత్యున్నత సేవలు చేసినందుకుగాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 పురస్కారానికి ఎంపిక
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
ఎందుకు : సమాజహితం కోసం అత్యున్నత సేవలు చేసినందుకుగాను
Published date : 05 Mar 2021 05:49PM